Tuesday 30 August 2016

ఆనందం నుంచి ఎటువైపు ప్రయాణం - ఒక మంచికథ




ఆనందం నుంచి ఎటువైపు ప్రయాణం
---------------------------------------------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


ఒక వ్యక్తి బాల్యంలో చాలా ఆనందంగా ఉండేవాడు.

మిత్రులతో దగ్గరే ఉన్న చిన్న అడివిలోకి  "పరికి పండ్లు"తెంపుకోవడానికి వెళ్లేవాడు. ఆ చిన్న అడవిలోని చెట్టూ పుట్టలతో స్నేహం చేసేవాడు. గిల్లి-దండ, బొంగరం, కోతికొమ్మంచిలాటి ఆటలాడేవాడు. ఆ చిన్న అడవిలోని చెట్ల ఆకుల మాటున దాగి ఉండే బంగారు పురుగులను వెతికేవాడు. దొరికితే ఆనందంతో కేరింతలు వేసేవాడు. వాటిని ఒక దారానికి కట్టి ఆడించేవాడు.వాటికి ఆకలౌతుందని కొన్ని ఆకులను తినిపించేవాడు. అయ్యో పాపం! అని వదిలివేసేవాడు. ఆకలైనపుడు అడవిలోని సీతాఫలాలు - నేరడి పండ్లు - బల్చి పండ్లు తెంపుకు తినేవాడు లేదా తోటల్లో మిత్రులతో కలిసి మక్కెండ్లు (మొక్కజొన్న బుట్టలు ) కాల్చుకు తినేవాడు. అక్కడక్కడ గుడులు - దేవుల్లు కనిపిస్తే భక్తితో ఏ కోరిక లేకుండా ఒకే ఒక క్షణం నమస్కరించి పరిగెత్తే వాడు. చెరువుల్లో కుంట బావుల్లో మిత్రులతో కలిసి "బుర్రకాయలను " భుజాన వేసుకుని ఈదులాడడానికి వెళ్లేవాడు. ఊర్లోకి వస్తూ వస్తూ ఎవరో కొందరు పెద్దలు గొడవపడి పంచాయితీలు పెట్టుకుని అరుస్తూ ఉంటే అర్థం కాకపోయినా కాసేపు నిల్చుని వింతగా చూసేవాడు. ఇంటికి వచ్చి ఇంతవరకు తిరిగి వచ్చినందుకు తిట్లు తినేవాడు. తరవాత తినేసి ఓళ్లు తెలియకుండా నిద్ర పోయేవాడు.

అయినా అతను ప్రతి క్షణం ఆనందంగా ఉండేవాడు.

చూస్తుండగానే రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. 

అతడు పెద్ద క్లాసుల్లోకి వచ్చాడు.

అప్పుడు కూడా అతను ఆనందంగానే ఉండేవాడు.

క్రొత్త వాతావరణంలో కూడా తానే ముందుగా పలకరిస్తూ నవ్వుతూ క్రొత్త పరిచయాలు చేసుకునేవాడు. తోటిమిత్రులతో జోకులేసుకుంటూ నవ్వుతుండేవాడు. చదివే సమయాలలో చదివేవాడు.    వాలీబాల్ - క్రికెట్టు -కబడ్డి - షటిల్ - బ్యాట్ మెంటెన్ వంటి ఆటలాడేవాడు. మిత్రుల చెల్లెలి పెండ్లైతే తన చెల్లెలి వివాహం అన్నంత కష్టపడి పనిచేసేవాడు. తన మిత్రుని అన్నకు ఏక్సిడెంట్ అయితే తన మిత్రులందరితో కలిసి ఆ కుటుంబానికి అండగా ఆ హాస్పిటల్ వద్దే పడిగాపులు కాసేవాడు. ఆకలైనపుడు మిత్రులతో కలిసి దొరికింది తినేవాడు. టూర్లకు వెళ్లేవాడు. బస్ స్టేషన్ - రైల్వే స్టేషన్లలో పడుకునేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి  పనుల్లో సహాయం చేసేవాడు. తల్లి ఒడిలో పడుకుని కాసేపు ముచ్చట్లాడే వాడు. తండ్రి చెబితే కరెంట్ బిల్లులు కట్టొచ్చేవాడు. తండ్రి చెప్పిన ఇతర పనులు చేసుకొచ్చేవాడు.

" రోజంతా ఈ తిరగడమేమిట్రా ! " అని తండ్రి చెడామడా మందలిస్తుంటే మౌనంగా ఉండేవాడు. తిట్టిన రోజు రాత్రి తాను పడుకున్నాననుకుని దగ్గరకు వచ్చి తన నుదిటిపై తండ్రి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ హాయిని కూడా మౌనంగా ఆస్వాదించేవాడు. 

అయినా అతను ప్రతి క్షణం ఆనందంగానే ఉండేవాడు.

కాలం క్షణంలా గడిచింది.

అదృష్టం కలిసివచ్చి సర్పంచ్ అయ్యాడు. MPP అయ్యాడు. MLA అయ్యాడు. తరువాత మంత్రి కూడా అయ్యాడు.

చుట్టూ ఉన్న సమాజం తనను గౌరవించసాగింది. తాను కూడా గౌరవంగా మసలుకోసాగాడు. జోకులెయ్యడం మానేసాడు. కష్టపడే అవసరం తగ్గిపోయింది. తన చుట్టూ తిరిగే వారందరి పనులు చేసి పెడుతున్నాడు.  పలుకుబడి గల వ్యక్తులతో విందులు - వినోదాలు - ఫైవ్ స్టార్ హోటల్ భోజనాలు. గుళ్లూ గోపురాలు కూడా ఎక్కువగా దర్శిస్తున్నాడు. తిరుపతి వెళ్లినా క్యూ కట్టే అవసరమే లేదు. స్వామి నాకు ఇంతకన్నా మంచి పోస్ట్ వస్తే నీ హుండీలో ఇంత డబ్బు వేస్తాను అంటూ మ్రొక్కుతున్నాడు.ఇంట్లో విషయాలు - పిల్లల విషయాలన్నీ భార్యే చూసుకుంటుంది. చాలా విషయాలు తన అసిస్టెంట్లే చూసుకుంటున్నారు. తన పలుకుబడి - మంత్రి స్టేటస్-బిజీ... పాత మిత్రులనందరిని దూరంగా ఉంచింది. తనపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి కనిపించినా సంతోషాన్ని నటిస్తూ ఆలింగనం చేసుకుంటున్నాడు. మనసులో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉన్నట్లు నటించడం అభ్యాసం చేశాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివి భార్యకు రోజూ " ఐ లవ్ యూ " చెబుతున్నాడు. కానీ తాను ఫీలింగ్ తో చెప్పడం లేదని తనది తనకే అర్థమౌతుంది. తాను అలా చెప్పినపుడు తన భార్య కూడా "ఐ టూ " అంటుంది. అయినా అతని మనసు ఆ ఫీలింగ్ ను స్వీకరించడం లేదు.

పుట్టినరోజు వచ్చినపుడు కుప్పలు తెప్పలుగా గ్రీటింగ్ లు వస్తున్నాయి. ఎందుకో ఏ ఒక్కటి అతనికి నచ్చడం లేదు. 

ఇప్పుడు ఆస్తులు - అంతస్తులు - పలుకుబడి - మంది మార్బలం ఉన్నా ఎందుకో అతను ఆనందంగా ఉండలేకపోతున్నాడు. ఎవరినీ హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నాడు. వారి ప్రేమను స్వీకరించలేకపోతున్నాడు. ఎందుకో భరించలేని ప్రేమ రాహిత్యంగా - ఒంటరితనంగా అనిపిస్తుంది. 

చుట్టూ "సార్ ! సార్! సార్! " అనే పిలుపుల మధ్య " ఏం రా! " అనే పిలుపుల కోసం హృదయం ఉవ్వీళ్లూరుతుంది. తాను ఏ స్థాయిలో ఉన్నా తనను తిట్టి మందలించే తల్లిదండ్రులు చనిపోయారు.

నిజానికి అతనికి "తనను ఎప్పుడూ ఆకాశానికి ఎత్తి పొగుడుతుండే మంది - మార్బలం " అంటే చికాకు . కానీ ఒంటరిగా ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఒంటరిగా వుంటే భరించలేని అశాంతి . అందుకే తప్పనిసరియై ఈ "మంది -మార్బలాన్ని " ఉంచుకుంటున్నాడు. ప్రతీ రాత్రి ఆ అశాంతిని మర్చిపోవడానికి తన పెద్ద ఇంట్లో ఒక చిన్న బార్ ను ఏర్పాటు చేసుకుని తాగి పడుకుంటున్నాడు. అయినా నిద్రరావడం కష్టంగా ఉంది.

కాలం చాలా భారంగా గడుస్తుంది.

పదవికాలం ముగిసింది. మళ్లి ఎలక్షన్లు వచ్చాయి. ఆ వ్యక్తి ఓడిపోయాడు. చుట్టూ ఎప్పుడూ ఉండే "మంది - మార్బలం " దాదాపుగా తగ్గిపోయింది. పాత మిత్రులు మొదటే దూరమయ్యారు. వ్యాపారాలు భార్య అసిస్టెంట్లే మొదటి నుండి చూసుకుంటారు. అప్పుడప్పుడు టివీ షోలలో మాట్లాడడం - లేదా టీవీలో ప్రస్తుత రాజకీయాలు చూడడం- ఫోన్.

అంతర్గతంగా భరించలేని ఒత్తిడి. బిపి - షుగర్ ముందే వచ్చాయి. ఇప్పుడు పెరాల్సిస్ (పక్షవాతం) ఎటాక్ అయ్యింది. ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు అతను మళ్లి మామూలు మనిషి కావడం కష్టం అన్నారు.

హాస్పిటల్లో ICU గదిలో షాక్ నుండి కోలుకున్న తరవాత అతను కళ్లు మూసుకుని ఆలోచించడం మొదలు పెట్టాడు.

" ఎందుకు తన పరిస్థితి ఇలా అయింది? ఎక్కడ పొరపాటు చేశాడు? "

ఆలోచించగా ఆలోచించగా అతనికి సమాధానం దొరికింది.

" తాను తనలాగా ఉండడం మానివేశాడు. నటించడం ప్రారంభించాడు. చివరకు భార్యా పిల్లల వద్ద కూడా!

ఈ సమాజం అంటే తన చుట్టూ ఉండే "మంది - మార్బలం "  అనుకుని , వాళ్లు తనను ఊహించుకున్నట్లుగా తాను తయ్యారవ్వడానికి ప్రయత్నించాడు. 
..... అలా నటిస్తూ నటిస్తూ ... ఆనందాన్ని కోల్పోతూ చివరకు " తనను తానే కోల్పోయాడు. "

"ఆ క్షణం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒకవేళ తనకు అవకాశం లభించి తన జీవిత కాలం పొడిగించబడితే "తాను తనలాగే జీవించాలని ".

కళ్లు తెరిచేసరికి భార్య ఏడుస్తూ ఎదురుగా కూర్చుని ఉంది. అతను తాను కదపగలిగే చేతితో తన భార్య చేతిని ప్రేమగా నొక్కాడు.

ఈ సారి అతనికి తన ప్రేమ ఫీలింగ్ తెలుస్తూ ఉంది. ఆమె ప్రేమకూడా అతనిలోకి ప్రవహించి ఒక రకమైన హాయిని ఇచ్చింది.

ఇప్పుడతడు ప్రేమించడం - ప్రేమను స్వీకరించడం రెండూ నేర్చుకున్నాడు.


                        స్వస్తి

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణోవసతు మమ హృద్ధామ్ని సతతమ్ ॥


          ( ఓపికగా చదివిన వారికి)
               ధన్యవాదములతో

          గురుమంచి రాజేంద్రశర్మ



Monday 29 August 2016

చంద్రుడు ఇచ్చే ఫలితాలు - దోషనివారణకు చంద్రకవచం

చంద్రుడు
---------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


భోజనం _ నిద్ర విషయంలో సరియైన విధంగా వ్యవహరించకుంటే చంద్రుని అనుగ్రహాన్ని కోల్పోతారు. లేదా చంద్రుని అనుగ్రహం లేకుంటే ఆ విషయాలలో సరియైన విధంగా ఉండలేరు.

భోజనం - నిద్ర అనేవి పునాది లాంటివి.వీటి విషయంలో మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రస్తుత మన మానసిక స్థితి ఉంటుంది.

ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తి ఆరోగ్యం - పవిత్రత - అవసరం - సమయం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని భుజించాలి. కాన్సియస్ తో భుజించాలి.

పాపం లేదా దోషాలు పెరుగుతున్న ఫుడు మనిషి స్పృహ లేకుండా తింటాడు.

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు.అలాగే అదృష్ట సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అనే దానిని "మహాభారతం " వివరించింది.

ఆ సందర్భంగా ఆహార అలవాట్ల ప్రస్తావన కూడా ఉంది.

ఉదాహరణకు...

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు.....

శ్లో|| యదాయ మతి కష్టాని సర్వాణ్యుపనిషేవతే| 
      అత్యర్థ మపివా భుంక్తే నవా భుంక్తే కదాచన॥


అంటే...

తనకు హాని కలిగించే విరుద్ధమైన ఆహార పదార్థాలను తింటూ ఉంటాడు.

ఒకప్పుడు జిహ్వ చాపల్యం వల్ల అతిగా తింటాడు. మరొకప్పుడు పూర్తిగా తినడాన్నే మానుకుంటాడు.

(పండ్లు ఫలాలు లాంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఇంట్లో మురిగి పోతుండగా చూస్తాడు కాని వాటిని తినాలనిపించదు.
పవిత్రపరిచే దేవుని ప్రసాదాలు చీమలు పడుతున్నా చూస్తాడు కాని, తాను తినడు - ఇతరులకు పంచి పెట్టడు. ఆయా విషయాల్లో అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.కాని ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.)

శ్లో || దుష్టాన్న మిషపానంచ యదన్యోన్య విరోధిచI 
       గురుచాప్య మితం భుంక్తే నాతి జీర్ణేZపివాపున:॥

తినకూడని, త్రాగకూడని పదార్థాలను సేవిస్తాడు. ఒకదానితో ఒకటి సరిపడని పదార్ధాలను తింటాడు.
బలం తక్కువ బరువు ఎక్కువైన వాటిని తింటూ ఉంటాడు.అంతేకాక, అంతకు ముందు తిన్నది జీర్ణం కాకముందే మరల పొట్టను నింపుతూ ఉంటాడు.

ఉదాహరణగా రెండు శ్లోకాలను మాత్రమే ఇచ్చాను.

నిద్ర కూడా వీలైనంత తొందరగా పడుకుని సూర్యోదయం లో పే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.

 అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు....

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా మానసిక శక్తికి చంద్రుడు కారకత్వాన్ని వహిస్తాడు.

జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే దానర్థం... అతడు గత జన్మల నుండే మానసికంగా ఉత్సాహంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడన్నమాట!

ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడో అతడు గత జన్మల నుండే దు:ఖపడడాన్ని - నిరుత్సాహాన్ని - నెగిటివ్ థింకింగ్ ను అభ్యాసం చేస్తున్నట్లు అర్థం.

ఈ జన్మంతా వ్యతిరేక ఆలోచనలతో గడిపి మరణిస్తే వచ్చే జన్మ జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థానంలో ఉంటాడు.

ఒక వ్యక్తి చేసిన మంచి - చెడు అభ్యాసాలు సంస్కార రూపంలో జీవుని వెన్నంటి ఉంటాయి. ఆ సంస్కారాలనూ, ఆ సంస్కారాల వల్ల ఆతడు పొందబోయే ఫలితాలను జాతకం విశ్లేషిస్తుంది.

కాబట్టి ప్రస్తుత స్థితి అనేది గత కర్మల ఫలితం.భవిష్యత్తు మరింత బాగుండాలంటే అది మనం చేసే వర్తమాన కర్మలను బట్టి ఉంటుంది.

మనం చేసే కర్మలన్నింటిని ప్రధానంగా మనస్సే ప్రేరేపిస్తూ ఉంటుంది.

... అలా సరియైన విధంగా ప్రేరేపించే మానసిక శక్తిని - పాజిటివ్ థింకింగ్ ను - మంచి భావాలు వ్యాప్తి చేయడం - ప్రేమపంచడం - భోజనం, నిద్ర విషయంలో క్రమశిక్షణ - బావులూ చెరువులు త్రవ్వించడం - జల సంరక్షణ -  ఉత్సహంగా సంతోషంగా ఉండడం - వినయం - ప్రసన్నత- మాతృభక్తి - మంచి కీర్తి - మాతృభాషలో ప్రావీణ్యం - హాస్యాన్ని ఆస్వాదించడం ..... మొ॥ మంచి లక్షణాలు చంద్రుని అనుగ్రహం వల్ల లభిస్తాయి.

ఈ క్రింద "చంద్రకవచం" ఫైల్ ఇస్తున్నాను .దీని పారాయణం వల్ల చంద్ర సంబంధ దోషాలు తొలగడమే కాక చంద్ర సంబంధ ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.

(ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది. ఉపయోగపడే ఏ పనులు మనకు చేయాలని అనిపించదో అందులోనే అదృష్టం దాగి ఉంటుంది.

సాధారణంగా మనస్సు ఎప్పుడూ ప్రయోజనం లేని పనుల వైపే లాగుతుంది.

ఈ క్రింద ఇచ్చే చంద్రకవచాన్ని డౌన్లోడ్ చేసుకోరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా  తన కోసం కాదన్నట్లు అలా జరుపుతూ వెళతారే కాని, చదవాలని అనిపించదు.
కాని ప్రతి సోమవారం చదివితే ఒక సంవత్సరం వరకు దీని ఫలితం ఏమిటో అర్థమౌతుంది.అదే సంస్కృత శబ్దాలకు ఉన్న మహాత్మ్యం.)


1. చంద్ర కవచం. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి


2.లేదా ఇక్కడ నొక్కి చంద్రకవచం డౌన్లోడ్ చేసుకోండి



           ( ఓపికగా చదివినవారికి)
                ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ

         శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం


Saturday 27 August 2016

నజర్ ( దృష్టి దోషం లేదా నరఘోష ) తొలిగిపోవడానికి స్తోత్రం

నజర్ ( దృష్టి దోషం ) తొలిగిపోవడానికి రెమెడీ


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

దృష్టిదోషం అంటే ఏమిటో కొంత వివరంగా తెలుసుకుందాం !

శబ్ద ,స్పర్శ ,రూప ,రస ,గంధాలు అనే వాటిని పంచతన్మాత్రలు అంటారు.

" బహిర్గతమైన ఆలోచనలే లేదా భావాలే శబ్దాలు ."

మనం మంచి శబ్దాలు(మాటలు) విన్నా మాట్లడినా మంచి ఫలితాలు రావడాన్ని గమనిస్తున్నాము.

అలాగే దీనికి వ్యతిరేకంగా చెడుశబ్దాలు విన్నా మాట్లడినా చెడు ఫలితాలు రావడాన్ని కూడా గమనిస్తున్నాము.

అలాగే పవిత్రంగా జీవించే మహాత్ముల స్పర్శ కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రమణ మహర్షి , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు వంటి మహాత్ములతో సహచర్యం చేసిన వారిని పరిశీలిస్తే అర్థమయ్యే విషయమే. 

అలాగే దుర్జన సాంగత్యం - వారి స్పర్శ మనని పతనం వైపూ లేదా కష్టాల వైపు నడిపిస్తుంది.

( మూడవది అయిన "రూపం "లోని విభాగమే దృష్టి కాబట్టి దీని గూర్చి చివరగా చెప్పుకుందాము.)

ఇక రసం అంటే రుచి - ఆహారం

"ఆహార శుద్ధౌ సత్వ శుద్ధి సత్వ శుద్ధౌ ధృవా స్మృతి . " అని శాస్త్రం.

మనం తినే ఆహారం కూడా మన గుణాలను ప్రభావితం చేస్తుంది.

కొన్ని ఆహార పదార్థాలు తింటే మనలో సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది.

మరి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచి అనారోగ్యం - ఆవేశం - కోపం పెరగడానికి కారణమౌతాయి.

ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తమో గుణాన్ని పెంచి సోమరితనాన్ని - బద్ధకాన్ని - నిద్రమత్తును కలిగిస్తాయి.

ఇక గంధం అంటే వాసన

సువాసనలు - దుర్వాసనలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేసి తద్వారా మనచర్యలను ప్రేరేపించి మంచి - చెడులకు కారణమౌతాయి.

ఇక మూడవదైన రూపం సంబంధించిన వాటిలో వచ్చేది దృష్టి .

ఒకానొక గాఢమైన భావంతో కూడిన చూపును దృష్టి అంటాము. అది మంచిది కావచ్చు! చెడ్డది కావచ్చు!

మంచిదైతే పాజిటివ్ ఫలితాలను - చెడ్డదైతే నెగిటివ్ ఫలితాలను పొందుతాము.


దేవతల, మహాత్ముల, మన శ్రేయస్సును బలంగా కోరుకునే తల్లిదండ్రులు మొదలైన వారి "అనుగ్రహ దృష్టి - శుభ దృష్టి " మనకు మంచిని కలిగిస్తుందనేది తెలిసిన విషయమే!

ఎక్కువగా మౌనంగా ఉండే రమణ మహర్షి , కంచి పరమాచార్య వంటి మహాత్ములు తమను అనుగ్రహంతో చూసినపుడు "ఆ సమయంలో తమ మనసు కొన్ని క్షణాలు ఆలోచనా రహితమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనై " తమ ఆలోచనలూ - జీవితం పూర్తిగా అభివృద్ధికర మార్గంలో ప్రయాణించినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు.

రామకృష్ణ పరమహంస ఏకాంతంలో చేసిన స్పర్శ - అనుగ్రహ దృష్టి ప్రసారం వివేకానందునిలో ఎటువంటి మార్పులను కలిగించిందో వివేకానందుని చరిత్రను చదివిన వారికి తెలిసిన విషయమే !

అలాగే దీనికి వ్యతిరేకంగా మనని ద్వేషించే వారి, మనమంటే ఈర్శ్య కలిగిన వారి , అపవిత్రంగా జీవించే వారి, మనం అభివృద్ధి చెందకూడదు అని బలంగా కోరుకునే వారి దృష్టి ని "నర ఘోష - నజర్ - లేదా దృష్టి దోషం" అంటారు.

ఇది మనకు చెడును కలిగిస్తుందని పూర్వం నుండి పెద్దలు చెప్పే విషయం.

ఇటువంటి దృష్టి దోషాన్ని - నరఘోష ను (నజర్ ను) తొలగించే " దత్త మాలా మంత్రం " అనే ఫైల్ ను ఈ క్రింద ఇస్తున్నాను .దీన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వల్ల ఎటువంటి దృష్టి దోషమైనా తొలిగిపోతుంది. బాగా బిజీగా ఉండేవారు కనీసం ఒకసారైనా చదువుకోండి.

సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి చదివితే మరింత మంచి ఫలితం ఉంటుంది.


1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )

2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి


 ఇకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

"నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహానికి ఏ దోషం అంటదు. "  అలాగే   ఎప్పుడూ క్రియాశీలంగా -  ఏక్టివ్ గా జీవించే వ్యక్తులకు కూడా ఏ దోషాలు అంటవు.

" ఆగిన నీరే మురికిగుంటగా మారి దోషాలకు నిలయమౌతుంది."

అలాగే సోమరితనం - బద్ధకం - అధిక సుఖలాలసత ...మొ॥వి  మనని అభివృద్ధి మార్గంలో ఆగేటట్లుగా చేసి దోషాలకు కారణమౌతాయి. ఈ దుర్లక్షణాలను వీలైనంత తొందరగా వదిలించుకుంటే ఎప్పటికీ ఏ దోషాలు మనని అంటకుండా ఉంటాయి.

                                     స్వస్తి

                       (ఓపికగా చదివిన వారికి )
                            ధన్యవాదములతో

                 గురుమంచి రాజేంద్రశర్మ





Thursday 25 August 2016

కృష్ణుడు - వ్యక్తిత్వ వికాసం

కృష్ణుడు

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

ఈ రోజు కృష్ణ జన్మాష్టమి

నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మం... " దైవం మానుష రూపేణ " అన్నట్లుగా  ద్వాపర యుగంలో సగుణ రూపంగా నడయాడడానికి అవతరించిన దినమిది.

శ్లో|| “బ్రహ్మణో వయసా యస్యమిమేష ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”
                             
                                   (శ్రీ బ్రహ్మవైవర్త పురాణం)

తా॥ ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

మరి అటువంటి కృష్ణుని జన్మదినం రోజున నాలుగు కొబ్బరికాయలు కొట్టి, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన సరిపోతుందా?

పూజించడం అంటే ఏమిటి?

ఒక పుత్రుడు తండ్రిని పూజించడం అంటే ప్రతీ రోజూ కాళ్లు కడిగి నమస్కరిస్తూ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోతుందా?

అవన్నీ చేసినా చేయకున్నా తండ్రి చెప్పిన మంచి విషయాలను త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అది నిజమైన పూజ అవుతుంది.

ఇక్కడ కూడా వేలసంవత్సరాలుగా మనం ఎందుకు కృష్ణుని ఆరాధిస్తున్నామూ , పూజిస్తున్నాము.

" కర్షయతి ఇతి కృష్ణః "– అని కృష్ణ శబ్ద వ్యుత్పత్తి.

అంటే ఆకర్శించేవాడు కృష్ణుడు అని.

వేలసంవత్సరాలుగా కృష్ణుడు మనను ఎందుకు ఆకర్శిస్తున్నాడు.

అతని వ్యక్తిత్వమూ , గుణగణాలు . బోధలు ఏమిటి? వాటి గూర్చి కొంతవరకైనా తెలుసుకుని త్రికరణశుద్ధిగా ఆచరించినపుడు అది నిజమైన పూజ అవుతుంది.

కృష్ణుని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలను ఈ వ్యాసంలో చర్చించే ప్రయత్నం చేద్దాము.

1.కృష్ణుడు - ఉత్తమ స్నేహితుడు

శ్లో౹౹ పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి !
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
షణ్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః !!

తా॥ ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు పాపపు పనులు - తప్పుపనులు చెయ్యకుండా నివారిస్తాడు, మంచి పనులు చేసేలా చేస్తాడు;
తన స్నేహితుని లోని బలహీనతలు రహస్యంగా ఉంచుతారు, అతని సద్గుణాలను అందరికీ తెలిసేలా చేస్తాడు; 
ఆపదలలో ఉన్నప్పుడు వదిలిపెట్టడు, అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు.

"ఈ ఆరు మంచి మిత్రుల లక్షణములు " అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ ఆరు లక్షణాలే కాకుండా ఇంకా అనేక ఉత్తమ స్నేహలక్షణాలను కలిగిన ఉత్తమ స్నేహితుడు శ్రీకృష్ణుడు.

బాల్యంలో స్నేహాలు వేరు. వయసు వచ్చి వ్యక్తిత్వం ఏర్పడ్డాక ఉండే స్నేహాలు వేరు.
బాల్యంలో ఆటపాటల మాటున మంచి చెడులు తెలియని స్నేహంలో బాధ్యత ఉండదు. బంధం మాత్రమే ఉంటుంది.

కానీ ,విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతీ బంధంలోనూ అలాగే ప్రతీ పనిలో కూడా  ఒక బాధ్యత ఏర్పడినట్లే స్నేహబంధంలో కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది.

స్నేహ ధర్మమంటే అదే!

అంతే కానీ , స్నేహితులు చేసిన ప్రతీ పని అది మంచిది కానీ చెడ్డది కానీ  సరియైనది అని నమ్మడం , అనుసరించడం నిజమైన స్నేహధర్మానికి వ్యతిరేకం.

యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం వచ్చిన తరువాత స్నేహితులలో ఎవరైనా తప్పుదారిలో వెళుతున్నప్పుడు హెచ్చరించడం చాలా ముఖ్యమైనది. స్నేహితుల్లో ఎవరికి అవసరమైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లే, తప్పు అనిపించినపుడు చెప్పడం కూడా అత్యంత అవసరం.

ఈ స్నేహలక్షణాలన్ని మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

అర్జునుడు యుద్ధ సమయంలో నిర్వీర్యుడైనపుడు, కర్తవ్యోన్ముఖుని చేసి శ్రీకృష్ణుడు తన స్నేహధర్మాన్ని చక్కగా అమలుపరిచాడు. చాలా సందర్భాలలో ఆవేశానికి గురియైన అర్జునుని  నివారించి సరియైన మార్గంలో నడిపించాడు.  అరణ్యవాస సమయంలో ఎప్పటికప్పుడు వారు  బలహీనతలకు గురియైనపుడు ధర్మమార్గాన్ని వీడకుండా స్నేహితుడై కాపాడాడు.

ధర్మప్రియులైనప్పటికీ, కష్టాల కొలిమిలో కొట్టుకుపోతున్నప్పుడు దారి తప్పే సందర్భాలు మానవులకు సహజం.
కాబట్టి ధర్మాచరణ చేయాలనుకున్న ఉత్తములైన పాండవులకు పరీక్షలు ఎదురైన సమయాలలో అండగా నిలిచాడు శ్రీకృష్ణుడు.
ఇందులో శ్రీకృష్ణుని స్వార్థప్రయోజనాలేవీ లేవు.

సహనాన్ని, మంచితనాన్ని, ధైర్యాన్ని పెంచడానికే శ్రీకృష్ణుని స్నేహధర్మం ఉపయోగపడింది. తద్వారా అర్జునుని ఆత్మోన్నతికి, అతడు పాశుపతాది అస్త్రాలను పొంది మరింత బలవంతుడూ, కీర్తిమంతుడు కావడానికి తద్వారా ధర్మసంస్థాపన జరిగి చివరకు సమాజహితానికి ఉపయోగపడింది.

చాలామంది దుర్యోధనుడు - కర్ణుని స్నేహం కూడా ఉత్తమ స్నేహంగా భావిస్తుంటారు.

కానీ అది తప్పు .

దుర్యోధనుడు ఏ తప్పు చేసినా ఇంకా రెచ్చగొట్టినవాడు కర్ణుడు. తన స్వంత యుక్తాయుక్త విచక్షణ ఏనాడూ ఉపయోగించి దుర్యోధనునికి మంచి చెప్పలేకపోయాడు. దుర్యోధనునికి దాసానుదాసునిగా తన ఆత్మను బానిసగా ఉంచి అధికారమదంతో ఏం చేస్తున్నా, అండగా నిలబడ్డాడు. అంతే కాదు మరింత రెచ్చగొట్టాడు.

అందుకే " కర్ణుడు లేకుంటే భారతమే లేదని " నానుడి వచ్చింది.

నిజానికి నిండు సభలోకి బుుత స్నాతయై ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురమ్మని ఆజ్ఞాపించి మహాభారత యుద్ధానికి ఆజ్యం పోసింది కర్ణుడే!

అంతే కాదు స్నేహితుడైన దుర్యోధనుడు కష్టకాలంలో ఉన్నప్పుడు గంధర్వులతో యుద్ధంలోనూ - విరాట పర్వం  గోసంగ్రహణ యుద్ధంలోనూ స్నేహితున్ని వదిలి పారిపోయినవాడు కర్ణుడు. 
తన వ్యక్తిగత పంతాలకు పోయి భీష్ముడు మరణించే వరకు స్నేహితున్ని తన కష్టాలకు తనను వదిలి యుద్ధరంగానికి రానివాడు కర్ణుడు.

చివరకు తన మాటలూ - చర్యలతో రెచ్చగొట్టి దుర్యోధనునితో సహా కౌరవులందరూ పతనం కావడానికి కారణమయ్యాడు.

దూరదృష్టి - వివేకం లేనిపనులతో ఒక స్నేహితుడు ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణగా కర్ణుడు నిలిస్తే....

ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలో దానికి ఉదాహరణగా శ్రీకృష్ణుడు నిలుస్తాడు.

ఒక స్నేహితుడు తండ్రిగా అక్కున చేర్చుకుంటాడు. సోదరునిగా అనురాగాన్ని పంచుతాడు.గురువుగా ఉపదేశమిస్తాడు. శిష్యునిగా సేవిస్తాడు.నాయకునిగా నడిపిస్తాడు. అనుచరునిగా అనుసరిస్తాడు. ఒక బావ గా పరిహాసాలాడుతాడు.సహచర్యం కోసం ఒక ప్రేమికునిలా తహతహలాడుతాడు.

అందుకే ఒక కవి..

" కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయమ్!"

' మిత్రం ' అనే రెండు అక్షరముల రత్నాన్ని ఎవరు సృష్టించారో కదా!!

అని ఆశ్చర్యపోతాడు.

ఈ స్నేహ లక్షణాలన్నీ మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

ఇక శ్రీకృష్ణుని స్నేహశీలతకు దృష్ట్వాంతంగా నిలిచే మరో ఉదాహరణ కుచేలోపాఖ్యానం .

శ్లో౹౹ దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి !
భుంక్తే భోజయతేచైవ
షడ్విధం మిత్ర లక్షణమ్ !!

అని శాస్త్రం మిత్రుని లక్షణాలను వివరిస్తూ తెలుపుతుంది.

అంటే స్నేహితుడు తన మిత్రునికి తన దగ్గర ఉన్నవి ఇస్తాడు. అతను ఇవ్వగలిగినవి తాను ప్రీతితో తీసుకుంటాడు.అతని రహస్యాలను అడుగుతాడు. తనవి చెప్తాడు;  స్నేహితుడు ఇచ్చిన దానిని ఇష్టంగా తింటాడు. తన దగ్గర ఉన్న వాటిని స్నేహితునికి అనురాగంతో తినిపిస్తాడు.

ఈ లక్షణాలన్నీ కుచేలునితో స్నేహాంలో కనిపిస్తాయి.

కుచేలుడు తనశక్తికొలది తెచ్చిన అటకులను సిగ్గుపడుతూ ఇవ్వడానికి బిడియపడినా తీసుకుని ఇష్టంగా తిన్నాడు. చెప్పకున్నా కుచేలుని కష్టాలను అర్థం చేసుకుని తీర్చాడు. సాదరంగా ఆహ్వానించాడు. ప్రేమగా వీడ్కోలు పలికాడు. తన రాచ కార్యాలను కూడా ప్రక్కకు పెట్టి కుచేలునితో మచ్చటించాడు. ప్రేమ పూర్వకంగా కౌగిలించుకున్నాడు.

ఎటువంటి భేషజాలు లేని నిష్కల్మషమైన స్నేహాన్ని , శ్రీ కృష్ణుడు కుచేలునిపై చూపించిన సందర్భంలో చూడవచ్చు.

బంధుత్వాల కన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనుండే స్నేహాలకు కాలక్షేపమే కాక బాధ్యత కూడా ఎక్కువేనని శ్రీకృష్ణుని ఉదాహరణగా తీసుకుని మనం గ్రహించవలసిన అవసరం ఉంది.

    ( శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీకందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణుని మరిన్ని ఉత్తమ వ్యక్తిత్వ అంశాలను తరువాతి భాగాలలో తెలుసుకుందాము.)
                  స్వస్తి
               ధన్యవాదములతో
          గురుమంచి రాజేంద్రశర్మ


Wednesday 24 August 2016

అతివిద్య - (హాస్యగుళికలు)

   ఒక నిరక్షరాస్యుడైన తండ్రి , పొలంలో కోసి సిద్ధపరిచిన ధాన్యపు కుప్పలకు  ఒక రాత్రి కాపు కాయడం కోసం, బాగా చదువుకున్న తన కొడుకును తోడుగా తీసుకెళ్లాడు.

వారు ఒక డేరా (టెంట్) ఏర్పాటు చేసుకుని అందులో కొంత సేపు కాపు కాసిన తరువాత మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.

అర్ధరాత్రి తరువాత, తండ్రి తన కొడుకును నిద్ర లేపాడు.

తండ్రి :- " ఒరేయ్ ! పైకి చూడూ! ఏం కనిపిస్తుంది."

కొడుకు:- " అందమైన వినీలాకాశం. మిలమిల మెరిసే నక్షత్రాలు ."

తండ్రి :- " సరిగ్గా చూడూ ! ఏం చెబుతున్నాయి అవి ? "

కొడుకు:-  " ఖగోళశాస్త్ర రీత్యా..
అనేక గెలాక్సీలు, లక్షలాది నక్షత్రాలు, మన భూమి లాంటి అనేక కోట్ల గ్రహాలు , అలాగే చంద్రుని లాంటి కోటానుకోట్ల ఉపగ్రహాలు ఈ విశ్వంలో ఉంటాయి. ఈ విశ్వంలో మన భూమి ఒక చిన్న పరమాణువు లాంటిది."

తండ్రి విపరీతమైన కోపంతో తన కొడుకును గట్టిగా చరిచి .....

" ఇడియట్,
తెలివి లేదా?
ఎవరో మన టెంట్ ను దొంగిలించారు. అర్థం కావడం లేదా!" అన్నాడు. !!!

నీతి: -
అతి విద్య, అతి భావుకత్వం కూడా ఒక్కొక్కసారి కామన్ సెన్స్ నూ- కాన్సియస్ నెస్ ను తగ్గించి, అభివృద్ధిని నిరోధించవచ్చు!


నటూరే అంటే ఏంటి ?- హాస్యగుళికలు

ఒక స్టూడెంటు ఇంగ్లీషు  ప్రొఫెసర్ని 'నటూరే' కి మీనింగు ఏంటి అని అడిగాడు.

 ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.

ఇంటికి పోయి ఇంగ్లీషు  ప్రొఫెసర్ ఎన్నో డిక్షనరీలు రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.

మర్నాడు క్లాసుకి వస్తూనే ఆ స్టూడెంటు మీనింగు చెప్పమని అడగ్గానే గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు. రోజూ స్టూడెంటు అడగడం  ప్రొఫెసర్    తప్పించుకోడం జరిగిపోతుండేది.  ఆ స్టూడెంటు కనపడితే చాలు  ప్రొఫెసర్ కి
భయంతొ కాళ్ళూ చేతులు వణికేవి.

ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంటుని అడిగాడు. "నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"


స్టూడెంటు చెప్పాడు 'NATURE' అని.

ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు.

వెధవన్నర వెధవ! నేచర్ ని నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా! నిన్ను కాలేజి నుంచి వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను.

అలా అనగానే ప్రొఫెసర్ కాళ్ళ మీద పడి స్టూడెంటు ఏడవసాగాడు.

సార్ ! కనికరించండి. అంత పని చేయొద్దు ! నా 'ఫుటూరే' నాశనం చేయకండి సార్ !!

ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)


అన్యోన్య దాంపత్యం కోసం జపాలు


కొంతమంది భార్యాభర్తల మధ్య చీటికిమాటికి తగాదాలు , గొడవలు , అభిప్రాయభేదాలు ఏర్పడుతుంటాయి.

అటువంటి వారు వారిమధ్యగల అభిప్రాయభేదాలు తొలిగి , అన్యోన్య దాంపత్యసౌఖ్యం ఏర్పడడం కోసం ఈ క్రింది సూచనలను పాటించండి.

1. ప్రతిరోజు సూర్యోదయం లోపు స్నానం చేయాలి.

2 . సాయంకాలం కూడా స్నానం చేయాలి.

3. అలాగే రెండు పూటల బ్రష్ చేసుకోవాలి.

4. టీవీ సీరియల్లు , టీవీ ఎక్కువగా చూడడం మానివేయాలి.

5. బెడ్ రూమ్ పరిశుభ్రంగా , నీట్ గా ఉంచుకోవాలి. 
( దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదించే గ్రహం " శుక్రుడు". జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేని వారు బెడ్ రూం ను చిందరవందరగా ఉంచుకుంటారు.)

6. ఇంటిలో వెంట్రుకల చిక్కులు కనిపించకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. (ఇది పితృదోషాన్ని సూచిస్తుంది.)

7. ఉదయం 8 am లోపు టిఫిన్
మధ్యాహ్నం 1-2 pm మధ్య లంచ్
రాత్రి 8.30 pm లోపే డిన్నర్ పూర్తి చేసుకోవాలి.
(అకాల భోజనం జాతకంలోని చంద్ర దోషాన్ని సూచిస్తుంది.)

8. ఇంటి టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
(టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడం రాహు- శని - చంద్ర సంబంధ దోషాలను సూచిస్తుంది.)

9. ఈ క్రింది లింక్ నుండి దాంపత్య సౌఖ్య జపాలు ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు అందులో సూచించిన విధంగా జపం చేయండి.




                                స్వస్తి

అన్యోన్య అనుకూల దాంపత్యసౌఖ్యాభివృద్ధిరస్తు
                        ధన్యవాదములతో
                   గురుమంచి రాజేంద్రశర్మ



Tuesday 23 August 2016

రవిగ్రహ ఫలితాలు - అనుగ్రహం పొందడానికి స్తోత్రాలు

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


సూర్యడు
---------------------------------------
జ్యోతిషశాస్త్ర దృష్ట్యా ఆత్మ శక్తికి సూర్యుడు కారకత్వాన్ని వహిస్తాడు.

ఆత్మశక్తి ఉద్దీపనం చెందిన వ్యక్తి మిగతా శక్తులను సులభంగా పొందుతాడు.

తండ్రిని గౌరవించని వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని వ్యక్తి, సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం గల వ్యక్తుల జాతకాలను పరిశీలించినపుడు వారికి సూర్యుడు వ్యతిరేక స్థానాలలో ఉండడాన్ని మనం గమనిస్తాము.

సూర్యుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులకు ఈ లోకంలో సాధించలేనిది అంటూ ఉండదు.
ఎందుకంటే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మ ప్రకాశవంతమౌతూ ఎప్పుడూ కాన్సియస్ తో ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ని దోషాలనుండి విముక్తమౌతూ అన్ని విషయాల్లోనూ సరియైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.

అలాగే ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
సూర్యుని అనుగ్రహం లేని వ్యక్తి తాను అసంతృప్తిని అనుభవిస్తూ ఇతరులను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల చివరకు తాను తృప్తిగా ఉండలేడు - అలాగే ఇతరులనూ సంతృప్తి పరచని స్థితి ఏర్పడుతుంది.

ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి అనే విషయం సూర్యున్ని చూసి నేర్చుకోవచ్చు!
సూర్యుడు ఇతరుల కోసం ప్రాత:కాలంలో ఉదయించడం లేదు. ఇతరుల కోసం అస్తమించడం లేదు. అది తన ధర్మం కాబట్టి ఈ పనులన్ని చేస్తున్నాడు. అప్పుడు లోకమంతా అతని ప్రవర్తనను అర్థం చేసుకుని తమ జీవితాలను అందుకు అనుగుణంగా మార్చుకుని సూర్యున్ని అనుసరిస్తుంది.
ఒక నాయకుడు కూడా సూర్యుని లాగే వ్యవహరించాలి.
తాను హృదయపూర్వకంగా నమ్మిన సిద్ధాంతాన్ని నియమబద్ధంగా ధృడమైనదీక్షతో ఆచరిస్తూ వెళుతున్నా కొద్దీ లోకం కూడా క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అనుసరిస్తుంది.
విజయం పొందిన ఏ నాయకుల చరిత్రను చూసినా ఈ విషయం సత్యమైనదని అర్థమౌతుంది.

సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.

రథస్యైకచక్రం భుజగనమితా సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
అంటే ....
(పురాణాలు వర్ణించిన ప్రకారం )సూర్య భగవానుడు ప్రయాణించే రథానికి ఒకే చక్రం ఉంటుదట. ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి.ఇక ఆ గుర్రాలను పట్టి ఉంచే పగ్గాలేమో పాములు. ప్రయాణించే మార్గం...ఆధారం లేని ఆకాశ మార్గం. ఆ రథాన్ని నడిపే   రథ సారథి తొడల నుండి క్రింది భాగం లేని అంగ వైకల్యం కల అనూరుడు.
ఇన్ని కష్టాలతో కూడిన ప్రయాణం చేస్తుా  కూడా ఆకాశంలో సూర్యుడు  గతి - నియమం - ధర్మం తప్పడం లేదు. మహాత్ములకు ఏ ఉపకరణాలు లేకున్నా సమస్త కార్యాలు సిద్ధిస్తాయని పై శ్లోకం యొక్క అర్థం.

ఇలాంటిదే సూర్యవంశ సంజాతుడైన రాముని గూర్చిన మరో శ్లోకం ఉంది.

విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః | 
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||

భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణాలు , అంటే
విమానాలు , నౌకలు వంటివి లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా , శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు, బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు,  ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు సరిగ్గా లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. ఇక తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు.
ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,విజయం సాధించి
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు  లభించిన ఉపకరణాలనూ - అనుచరులనూ - పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని - విజయాన్ని సాధించగలరు.
ఆదే విధంగా నిజమైన నాయకులు ఎలాంటి అనుచరులూ - ఉపకరణాలు ఉన్నా , ఎన్ని కష్టాలు ఎదురైనా వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు.
ఇదిగో ఇలాంటి ధృతిని - నాయకత్వ లక్షణాలను ప్రసాదించేది సూర్యుడు.

ఇంకా
సమయ పాలన - ఇతరులను గౌరవించడం - దానగుణం - మాటకు కట్టుబడి ఉండడం -పితృభక్తి - ఆరోగ్యం పట్ల శ్రద్ధ - నాయకత్వ లక్షణాలు - అంత:శుద్ధి - హుందా స్వభావం - ఆత్మ విశ్వాసం - నిజాయితీ - రాముని లా ధర్మం,సత్యం విషయంలో కఠిన ప్రవర్తన... మిగతా విషయాలలో సున్ని తత్వం  - ఆర్థిక పరమైన స్పృహ లేదా అభిమానం - ఇతరుల వద్ద చెయ్యి చాపక పోవడం ..... మొ|| మంచి లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటే లభిస్తాయి.

ఈ క్రింది ఆదిత్య హృదయం ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని పారాయణం చేయడం వల్ల ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.ఈ ఆదిత్య హృదయం రావణునిపై విజయం సాధించడం కోసం అగస్త్య మహర్షి స్వయంగా రామునికి ఉపదేశించాడు. ఇది చాలా మహత్యం కలిగింది.దీనిని ప్రతిరోజూ చదివితే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ఈ క్రింది  "సూర్య కవచం " ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైన కవచం. దీనిని శ్రద్ధగా పారాయణం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభించడమే కాక, పితృ దోషాలు జాతకంలో ఉన్న వారికి ఆ దోష ప్రభావం తగ్గి అన్ని విషయాలలో చక్కని అభివృద్ధి ఏర్పడగలదు.


ఇంకా ఇతర స్తోత్రాలు ఆదివారం చదవ వలసినవి.ఈ క్రింది ఫైల్స్ పై నొక్కండి.



                           స్వస్తి
                                 ధన్యవాదములతో
                         గురుమంచి రాజేంద్రశర్మ


Monday 22 August 2016

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

ఈ స్తోత్రమ్ లో 6 శ్లోకాలు ఉన్నాయి.
ఒక్కొక్క శ్లోకం చదువుతూ 10 రూ/ ఒక బాక్స్ లో వేయాలి. అలా 6 శ్లోకాలు చదివి 60 రూ/ వేయాలి.
ఇలా నియమబధ్ధంగా చేస్తూ ఉంటే నెలకు 1800  రూ/
సంవత్సరానికి 21,600 రూ/ పొదుపు అవుతాయి.
ఈ డబ్బులను స్థిరంగా ఉండే విధంగా బంగారం,ఇంటి నిర్మాణం,లేదా ఇంటి ప్లాట్ లో పెట్టుబడి పెట్టాలి.

ఇలా ప్రతిరోజూ జరిగే పొదుపు ధ్యానం తర్వాత తర్వాత గొప్ప శక్తి గా వృద్ధి చెంది మన జీవితాలలో మంచి ఆర్థికాభివృద్ధికి కారణమౌతుంది.

ఒక సంవత్సరం చేసి చూస్తే ఈ నియమం మహాత్మ్యం మనకు అర్థమౌతుంది.

స్వస్తి
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ

ఉపయోగపడే ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.

ఈ క్రింది లింక్ నొక్కి "క్షిప్ర ఫల ధనలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.






ధనప్రాప్తికి రామాయణం

ఈ క్రింది లింక్  ద్వార ధనప్రాప్తికి రామాయణం అనే ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పారాయణం చెయ్యడం వల్ల ఆదాయం పెరుగుతుంది. రోజూ వీలు కానివారు కనీసం ప్రతి శనివారం అయినా చదవండి.

శుభం భవతు

స్వస్తి

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ


ధనప్రాప్తికి రామాయణం











.

Sunday 21 August 2016

డబ్బు నిలకడ ఉండాలంటే.....


డబ్బు నిలకడ ఉండాలంటే పాటించవలసిన రెమిడి.
-----------------------------------------------------------


చాలా మందికి డబ్బు నిలకడ ఉండడం లేదు అనేది సమస్య.

"ఎంతో కష్టపడుతున్నాను. ఆదాయం కూడా పర్వాలేదు.కాని ఇన్ని సంవత్సరాలు ఫలితం చూస్తే మిగిలింది కూడా పెద్దగా లేదు." అనే బాధ ఉంటుంది.

సంపాధించిన డబ్బు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్ లో ఖర్చు చేయడం వల్లనో,  ఇతర కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఖర్చు కావడం వల్లనో,  ఇతరులకు అప్పులు -జామీనులు ఇచ్చి మునగడం వల్లనో, లేదా ఉన్న ఆదాయాన్ని మరింత ఆశతో అనవసర వ్యాపారాల వైపు మళ్లించి నష్టపోవడం వల్లనో ... ఇలా ఏదో ఒక కారణం వల్ల డబ్బు నిలకడ తగ్గుతుంది.

పోని,తెలివి లేక నష్టపోయారా? అంటే అదీ కాదు. వీరే ఎంతో మందికి సలహాలు ఇచ్చి - సహాయాలు చేసి ఇతరుల అభివృద్ధికి కారణమౌతారు.ఆ లాభపడ్డ వ్యక్తులెవరూ వీరి సహాయాన్ని గుర్తించే స్థితిలో ఉండరు. పైగా ఒకింత వ్యతిరేక భావనతోనే ఉంటారు.

జ్యోతిష దృక్కోణంలో విశ్లేషించినపుడు గతజన్మ సంబంధించిన జాతక దోషాలు ఉండవల్లగానీ, లేదా వంశపారంపర్య పితృ దోషాలు ఉండడం వల్లనో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

అంటే ... (గత జన్మలలో)వీరు కానీ లేదా వీరి పూర్వీకులు గాని ..."ఉన్న పుణ్యఫలం కన్న లేదా చేసిన శ్రమ కన్నా అధికంగా సుఖాలు అనుభవించడం వల్ల ఇలాంటి దోషాలు వస్తూ ఉంటాయి."

" అంటే కాలానికి శ్రమను లేదా పుణ్యఫలాన్ని బాకిపడి (అప్పు పడి)ఉంటారన్న మాట!

ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఈ క్రింది లింక్ ను నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం"ను డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఉదయం స్నానం తరువాత చదువుకోవాలి. ఇది మనను పూర్తిగా పాజిటివ్ గా ఉంచే బీజాక్షరాలతో కూడిన స్తోత్రం. ఎలాంటి అనుమానాలు లేకుండా స్నానం తరువాత వెంటనే ఈ స్తోత్రం చదువవచ్చు. ఈ స్తోత్రం చదివిన తరువాత ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంగా ఒక 4 నుండి 6 కిలోమీటర్లు నడిచి రావాలి (వాకింగ్ చేయాలి).
ఇది ఇంతకు ముందు ఎంతో మంది పరీక్షించి అనుకూల ఫలితాలు పొందిన రెమిడి.

1) స్తోత్ర పారాయణం వల్ల క్రమంగా పాజిటివ్ మార్గంలో ప్రయాణించి వేగంగా పుణ్యఫలం వృద్ధి పొందుతుంది.

2) తరువాత చేసే వాకింగ్ వల్ల శ్రమశక్తి వృద్ధి చెంది విధికి (లేదా కాలానికి) ఉన్న బుణం చెల్లింపు జరిగి వేగంగా అభివృద్ధి జరుగుతుంది.

ఇది అనుభవ పూర్వకంగా కేవలం ఒక మూడు నెలల లోనే బుుజువయ్యే రెమిడి.

రెమిడిలోని రెండు విషయాలను (స్తోత్ర పఠనం - వాకింగ్) ఆచరించినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది. వాకింగ్ కు అవకాశం లేని వారు కోరిక లేకుండా ఏదైనా గుడికి వెళ్లి 108 లేదా 41 ప్రదక్షణాలు చేయవచ్చు.

ఈ రెమిడి పాటించడం మొదలు పెట్టిన తరువాత మన హృదయంలో పెరుగుతున్న శాంతి మనం సరియైన మార్గంలోనే వెళుతున్నట్లు సూచిస్తుంది.

                         స్వస్తి
           ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్ర శర్మ.
ఈ క్రింది లింక్ నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.




Thursday 18 August 2016

నెగిటివ్ భావాలను నూరి పోయకుంటే ...

ఇది అసాధ్యం అని ఎవరూ చెప్ప లేదు
----------------------------------------------------

ఒకసారి ఇద్దరు అబ్బాయిలు మంచుపొరలపై ఆడుకుంటున్నారు.

అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒక అబ్బాయి మంచుపొర కూలి నిలుచున్నవాడు నిలుచున్నట్లే మంచు అడుగున గల సరస్సులో పడిపోయాడు.

రెండో అబ్బాయి అతన్ని రక్షించడానికి మొదటి అబ్బాయి పడిపోయిన చిన్న రంధ్రం నుండి ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు.

వెంటనే అతడు చాలా వేగంగా ఒక చెట్టు వద్దకు పరుగెత్తి చాలా పెద్ద సైజులో ఉన్న చెట్టు కాండాన్ని పడగొట్టి దాన్ని ఎత్తుకుని వచ్చి మంచుగడ్డలను పగలగొట్టి ఆ రెండో అబ్బాయిని రక్షించి హాస్పిటల్లో చేర్పించాడు.

తరువాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి "అత్యవసర సహాయ విభాగం "వారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించారు.

అడ్డంగా ఉన్న ఆ చెట్టు కాండాన్ని కొంత మంది కలిసి పట్టి దూరంగా పడవేసారు.

తరువాత ఇలా అన్నారు.

"ఆ అబ్బాయి ఎలాంటి పనిముట్టు లేకుండా ఆ చెట్టు కాండాన్ని విరవడం అసాధ్యం.

దానిని ఒక్కడే మోయడం ఇంకా అసాధ్యం.

దానితో మంచును పగలగొట్టడం మరీ అసాధ్యం.

ఆ అబ్బాయిని రక్షించడం మరీ మరీ అసాధ్యం.

ఇదెలా సాధ్యమైంది?" అన్నారు ఆశ్చర్యంగా.

అప్పుడు అక్కడే ఉన్న ఒక సాధువు" ఇదెలా సాధ్యమైందో నన్ను చెప్పమంటారా?" అన్నాడు.

అందరూ ఒకేసారి "చెప్పండి! ఎలా సాధ్యమైంది?" అన్నారు.

ఆ సాధువు ప్రశాంతంగా ...

''ఆ అబ్బాయికి 'నీకిది సాధ్యం కాదు - నీ విది చేయలేవు - ఇది అసాధ్యం ' అనే నెగిటివ్ మాటలను ఎవరూ బోధించలేదు. అందుకే ఇది సాధ్యమైంది!"

అని మెల్లగా నడిచి వెళ్లిపోయాడు ఆ సాధువు.

నీతి: -

బాల్యం నుండి నెగిటివ్ విషయాలు బోధించబడకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు.

               ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ



శ్రావణపౌర్ణమి రోజునే ఎందుకు రాఖీ ధరిస్తాము ?

 రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


శ్రావణపౌర్ణమి రోజునే రాఖీపౌర్ణిమ ఎందుకు ?
-----------------------------------------------------
రాఖీపౌర్ణిమ , జంధ్యాలపౌర్ణిమ గా పిలువబడే శ్రావణ పౌర్ణిమ సోదర సోదరీమణుల ఆత్మీయతకూ, అనురాగానికీ , ప్రేమకు ప్రతిరూపం.
భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో మధురమైన గుర్తు ఈ పండగ.
వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఈ రాఖీ బంధం సృష్టిస్తుంది.
సోదర ప్రేమకు చిహ్నంగా ఈ రక్షాబంధనం ప్రాచుర్యం పొందింది.
అసలు సంవత్సరంలో ఇన్ని రోజులుండగా ఈ శ్రావణపౌర్ణిమ రోజునే రాఖీపండుగను ఎందుకు జరుపుకుంటున్నామో చూద్దాము.
జ్యోతిష దృక్కోణంలో చూసినపుడు అమావాస్య జ్ఞాన సిద్ధికి ప్రతీక అయితే పౌర్ణిమ కార్యసిద్ధికి ప్రతీక.
( ఎందుకంటే ఆత్మకారకుడు ఐన రవితో మనో కారకుడు అయిన చంద్రుడు ఒకే డిగ్రీ పై కలయిక జరిగినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. రవికి సరిగ్గా ఎదురుగా 180 డిగ్రీల దూరములో ఉన్నప్పుడు పౌర్ణిమ ఏర్పడుతుంది.
నిజానికి " మన్" అన్న సంస్కృత ధాతువు నుండి మనస్సు, మనిషి అనే శబ్దాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనోకారకుడు ఐన చంద్రుడు మనిషికి ప్రతీక. రవి పరమాత్మకు ప్రతీక.
పరమాత్మతో సంయోగం సూచించే అమావాస్య  జ్ఞానసిద్ధి కారకమయితే , ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ ప్రకాశాన్నీ , తేజస్సు ను పొందే పౌర్ణిమ కార్యసిద్ధికీ - సంపూర్ణ అభివృద్ధికి ప్రతీక.)
ఇక పౌర్ణిమ రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమి ఉండే మాసానికి పేరు ఉంటుంది.
ఉదాహరణకు..
పౌర్ణమి రోజు చిత్త నక్షత్రం ఉండే మాసం చైత్రమాసం.
పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉండే మాసం వైశాఖ మాసం.
పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉండే మాసం జ్యేష్ఠ మాసం.
పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉండే మాసం ఆషాఢ మాసం.
అలాగే పౌర్ణమి రోజు శ్రవణం నక్షత్రం ఉండే మాసం శ్రావణ మాసం.
...ఇలాగే అన్ని మాసాలున్నూ.
"శ్రవణం కార్యసాధకం " అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఒక్కోక్క నక్షత్రం యొక్క ప్రత్యేకతను చెబుతూ అశ్విని వైద్యానికి , భరణి అపమృత్యు దోష నివారణకూ,.....ఇలా శ్రవణం కార్యసాధన ఫలితాన్ని ఇస్తుందనీ , అలా ఉపయోగించుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఇకపోతే శ్రవణానికి అధిదేవత "విష్ణువు".
సృష్టి కారకుడు బ్రహ్మ , లయ కారకుడు శివుడు అయితే స్థితి కారకుడై రక్షించేది విష్ణువు.
కాబట్టే అలాంటి జగత్ రక్షకుడయిన విష్ణువు అధిదేవత గా గల కార్యసిద్ధిని కలిగించే శ్రవణా నక్షత్రం ఉండే "శ్రావణపౌర్ణిమ" రోజున మనం రాఖీపౌర్ణిమ జరుపుకుంటాము.
ఇక ఈ రక్షాబంధనం ఎలా చేయాలో అందరికీ తెలిసినా ఇప్పటితరం వాళ్లకు తెలియడానికి మరోసారి తెలియజేస్తున్నాను.

శ్రావణ పౌర్ణమి నాడు సోదరీమణులు ఓ పళ్లెంలో రాఖీలు,పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వంటి ద్రవ్యాలను ఉంచి , ముందుగా కులదైవాన్ని ప్రార్థించి,  ఏదైనా తీపి ప్రసాదాన్ని నివేదించాలి. తర్వాత దేవునిముందు రాఖీలను పూజించి ,అనంతరం ఈ ప్రసాదాన్ని మరియు రాఖీలను ఉంచిన పళ్లెమును తీసుకుని వచ్చి, అన్నదమ్ములకు తిలకం దిద్ది,  తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి.
ఈ రోజున కట్టే రాఖీలకు విష్ణుశక్తిని ఆవాహన చేసే ఈ క్రింది మంత్రాలను చదువుతూ సోదరీమణులు తమతమ సోదరుల కుడి చేతి మణికట్టుకు రక్షను ( రాఖీని) కట్టాలి.
1) యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
తా౹౹ మహాబలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా? నీవు స్థిరత్వంలో ఉండగలవు-అని దీని అర్థం.
2) వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ। శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవోభిరక్షితు।।
తా ౹౹ వనమాలినీ, గదనూ, శంఖమునూ,చక్రమునూ, నందకములను ధరించిన హే ! నారాయణా! విష్ణూ ! వాసుదేవా! మా సోదర కుటుంబాన్ని, మా కుటుంబాన్ని అన్ని వైపుల నుండి - అన్ని విధాలుగా నిరంతరం రక్షించుచుండుము అని భావం.
ఇలా రాఖీ కట్టాక భగవంతునికి నివేదించిన తీపి ప్రసాదాన్ని సోదరులకు తిపించాలి. ఆ తర్వాత సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.
అక్కా చెలెళ్ళు అడిగిన బహుమతిని లేదా తమతమ శక్తికొలది సాంప్రదాయ బద్ధంగా బహుమతిని సోదరులు అందించి ఆనందాన్ని పొందుతారు.
ఈ శ్రావణపూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుందని సనాతన ధర్మాన్ని పాటించే ప్రజల విశ్వాసం. జన్మతః సోదరులు కాని వారందరినీ కూడా ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ఈ ‘రక్షాబంధనం 'లో ఇమిడి ఉంది.
తన సోదరుని  లేదా సోదర సమానుని క్షేమం కాంక్షించే ప్రతి సోదరి పవిత్ర రక్షను అతని మణికట్టుకు ముడి వేస్తుంది. ఈ రక్ష ఏ ఆపద సమయంలోనైనా తన సోదరుడిని రక్షించాలని ఆమె ఆకాంక్ష. సోదరి ప్రేమకు సంకేతంగా ఉండే ఈ సూత్రం సోదరుడికి తన అక్కా లేదా చెల్లెలి విషయంలో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సోదరి సుఖసౌభాగ్యాల కోసం అతను ఎలాంటి త్యాగాలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహం కల్గిస్తుంది.
నిర్భయ వంటి సంఘటనలు జరుగుతున్న ఈ కాలం లో ప్రజల మధ్య సోదర సోదరీ సంబంధాలు పెరుగవలసిన ఆవశ్యకతను ఈ శ్రావణపౌర్ణిమ నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది.
ఇంతటి శుభసమయవేళ  ఈ వ్యాసాన్ని నా సోదరికి అంకితమిస్తూ మీ అందరికి రాఖీపౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
                       స్వస్తి
          (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్రశర్మ


Wednesday 17 August 2016

కనిపించని అనుగ్రహాలు



కనిపించని అనుగ్రహాలు, కారణాలు
------------------------------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


సాధారణంగా మనమందరం నేను చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం సాధించాను. లేదా నా కృషి ఫలితంగానే ఈ ఆపదలు తొలగిపోయాయి, ఈ గండాలు గట్టెక్కాయి అని అనుకుంటూ ఉంటాము.
కాని ఆథ్యాత్మిక దృక్కోణంలో చూసినపుడు వాటి వెనుక కనిపించని అనుగ్రహాలు, కారణాలు కూడా ఉంటాయి.
ఉదాహరణగా ఈ క్రింది కథను చదవండి.
                  
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది.
ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.
... ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.
అతను కూడా భయపడుతూ బస్సు  దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు "నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.
వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.
కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...
అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
                  
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ,  ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు! పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి  అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు...
"బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.
ఒక్కరుగా మనం ఆలోచించగలము, పలుకగలము అంతే!
కాని, అందరుగా ఆ ఆలోచనలను పంచుకోగలము, మాట్లాడగలము .
ఒక్కరుగా "ఎంజాయ్ " చేయగలము అంతే!
కాని,అందరుగా "సెలబ్రేట్ " చేసుకోగలము.
ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము.
  That's the BEAUTY of
    Human Relations.
ఇదే సనాతన ధర్మం మనకిచ్చే సందేశం.
   సర్వే జనా: సుఖినోభవంతు!
   సమస్త సన్ మంగళాని భవంతు!
    ఓం  శాంతి  !శాంతి ! శ్శాంతి !
                   
                     స్వస్తి
(ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
        గురుమంచి రాజేంద్రశర్మ

ఎవరు పేదవారు ? ఎవరు ధనవంతులు ?

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ


ఎవరు పేదవారు???
              ⭐ ⭐ ⭐
ఒక  చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ!  నా కుమారుడి వివాహం.  కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."
అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.
కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.
అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.
ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?
సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.
ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.
ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???
             ⭐ ⭐ ⭐
ఎవరు ధనవంతులు ???
                 
ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.
పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.
"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.
" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"
"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.
కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.
మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...
వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?"  అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.
"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ
ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.
ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.
నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?
ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???
చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.
కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.
                 
             
                   స్వస్తి
       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్రశర్మ


Tuesday 16 August 2016

ప్రేమా, ఓదార్పు - చంద్రుని ప్రభావం

మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం - చంద్రుని ప్రభావం
------------------------------------------------

మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం జాతకం లో చంద్రుడు అనుకూలంగా ఉన్నవారికి సహజంగానే ఉంటుంది.

జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేకంగా ఉన్నవారు సాధారణంగా ఇతరుల మనసును నొప్పిస్తుంటారు. వారు ప్రేమనూ, ఓదార్పును ఇవ్వలేరు.స్వీకరించలేరు కూడా!

ఎందుకంటే వారు గత జన్మల నుండే ద్వేషాన్ని - ద్వేషభావనలను ... దు:ఖాన్ని - దు:ఖ భావనలను అభ్యాసం చేస్తున్నారన్నమాట.
ఇప్పుడు అకస్మత్తుగా ప్రేమనూ - ధైర్యాన్ని అందించుమంటే అది వారికి కష్టమైన పని.

"ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".

అందువల్ల జాతకంలో ఈ చంద్రుడు వ్యతిరేకంగా ఉన్నవారు ఇతరులకు దు:ఖాన్ని ఇవ్వగలరు. లేదా భయాన్ని అందించగలరు. లేదా వారి మనుసులో అశాంతినీ - ద్వేషాన్ని సృష్టించగలరు. ఇంకా ప్రయత్నిస్తే రాగాన్ని (ద్వేషానికి వ్యతిరేక పదం . ఈ రాగం అశాశ్వతం. ఇది ఏ క్షణమైనా ద్వేషంగా మారిపోవచ్చు!) కలిగించగలరు.కాని ప్రేమనూ - ఓదార్పును అందించడం వారికి కష్టమైన విషయం. ఎందుకంటే ఏదైనా మనకు అభ్యాసం వల్లనే సాధ్యమౌతుంది.

"అభిత : అస్యతే పరిచీయత ఇత్యభ్యాస : "

(అంటే అంతట పరిచయం చేయబడి ఉన్నది.)

"అభిత : అశ్యతే వ్యాప్యత ఇత్యభ్యాశ:"

(అంటే అంతట వ్యాపించి ఉన్నది.)

అనే రెండు వ్యుత్పత్తి అర్థాలు అభ్యాస శబ్దానికి ఉన్నాయి.

మొదటి అర్థం ప్రకారం అది మంచిదైనా చెడ్డదైనా అభ్యాసం చేసిన విషయం శరీరానికీ - మనసుకూ - బుద్ధికీ - చివరకు ఆ జీవాత్మకు బాగా పరిచయం చేయబడి సహజ గుణంగా మారుతుంది.

రెండవ అర్థం ప్రకారం అభ్యసించిన విషయం స్థూల శరీరంలోనూ - సూక్ష్మ శరీరంలోనూ - చివరకు కారణ శరీరంలోను పూర్తిగా వ్యాపించి సహజ గుణంగా మారుతుంది.

జాతకం అనేది ఒక వ్యక్తి గత జన్మలలో చేసిన మంచి - చెడు అభ్యాసాలను విశ్లేషించి దాని వల్ల ఆ వ్యక్తి పొందబోయే ఫలితాలను తెలుపుతుంది.

ఇక్కడ ఒక వ్యక్తికి  జాతకంలో చంద్రుడు వ్యతిరేక స్థానంలో ఉన్నాడంటే అతనికి దు:ఖం లేదా ద్వేషం సహజగుణంగా మారిందన్న మాట! ఈ కర్మ ఫలితాన్నంతా చంద్ర దశా అంతర్దశలలో అనుభవిస్తాడు.

ఉదాహరణకు

తండ్రి పట్ల ద్వేషంతో ఉన్నవాడైతే రవిదశ - చంద్ర అంతర్దశలో , భాగ్యాధిపతి మొక్క చంద్ర అంతర్దశలో , చంద్రదశ - రవి అంతర్దశలో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు.

తల్లితో ద్వేష ప్రవర్తన ఉంటే - చంద్ర (చతుర్ధిపతి) సంబంధ దశా అంతర్దశలలో ...

మేనమామ తో ద్వేష ప్రవర్తన ఉంటే - బుధ సంబంధ దశా అంతర్దశలలో ...

సోదరులతో ద్వేష ప్రవర్తన ఉంటే - కుజ సంబంధ దశా అంతర్దశలలో ...

....ఇలా కారకత్వాలను బట్టి దశా అంతర్దశలలో కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది.

కాబట్టి ఇతరులకు మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించడం వల్ల చంద్రుని అనుగ్రహాన్ని పొందుతాము .దీని వల్ల అవతలి వ్యక్తుల కన్న ఎక్కువ ప్రయోజనం మనకే సిద్ధిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి.

కేవలం డబ్బు మాత్రమే కాదు సుగుణాలు కూడా సంపదనే!

ఇంతకు ముందు చెప్పనట్లు  "ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".

మనం ఇతరులకు దు:ఖాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా దు:ఖం ఉందన్న మాట!

మనం ఇతరులకు ద్వేషాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ద్వేషం ఉందన్న మాట!

మనం ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ఆ గుణాలు ఉన్నాయన్న మాట!

ఆలోచించేవారికి మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మనలో ఉన్న గుణ సంపదలు - గత జన్మల నుండి అభ్యాసం చేస్తున్న మన సంస్కారాలు అర్థమౌతుంటాయి.

ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందించినపుడు ఒక్కొక్కసారి అది ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఉదాహరణగా ఈ క్రింది కథను చదవండి.

ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది .
.
.
జీన్ థామ్సన్  ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది .

పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని .

అబద్ధం ఎందుకు అంటే ఎప్పుడూ మూడో వరసలో కూర్చునే  "టెడ్డీ స్టాండర్డ్ " ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం గమనించింది . అయితే అప్పుడు అతడు తన క్లాస్ కాదు . అయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం లేదు . 
.
నెలలు గడుస్తున్నాయి . అతడి పేపర్స్ లో ఆమె రెడ్ మార్కులూ , తక్కువ మార్కులూ వేస్తోంది . అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 
.
ఆమె పని చేసే స్కూల్ లో పిల్లలను గురించి టీచర్ రికార్డు రాయాలి . అందరి రికార్డులు రాసేసినా ఎందుకో ఆమెకు టెడ్డీ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . క్రిస్మస్ వచ్చేస్తోంది . రికార్డు రాసి అప్పగించాలి . 
.
ఒక రోజు అతడి పాత రికార్డు తిరగేసింది . 
.
అతడు ఒకటవ తరగతిలో టీచర్ ఇలా రాసింది .

" టెడ్డీ చాలా సరదా కుర్రాడు . అతడితో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు . హోం వర్క్ నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ " 
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కొంత కుటుంబం లో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు " 
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ చాలా కష్ట పడుతున్నాడు .. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు " 
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ చదువులో వెనుకబడి పోయాడు . అతడు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక ప్రోబ్లం చైల్డ్ కాబోతున్నాడు " 
.
.
థామ్సన్ కి ప్రాబ్లం అర్ధం అయ్యింది .

ఇన్నాళ్ళూ తను టెడ్డి గురించి తెలుసుకోనందుకు బాధ పడింది ఆమె .
అయితే ఆమె క్రిస్మస్ వేడుకలకు పిల్లలను తయారు చెయ్యడం లో తలమునకలు ఐపోయింది . టెడ్డీ ని సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 
.
.
క్రిస్మస్ కు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇవ్వడం ఆచారం 
.
పిల్లలు ఆమెకు విలువైన కానుకలు ఇస్తున్నారు అందమైన రేపర్లు చుట్టిన కాగితాలలో విలువైన గిఫ్ట్స్ . 
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు టెడ్డీ . ఆ బేగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక ఇమిటేషన్ రాళ్ళ నెక్లెస్ ఉంది అందులో సగం ఊడిపోయాయి . ఒక సెంటు బాటిల్ ఉంది .అందులో సగం సెంటు ఉంది . 
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు . థామ్సన్ వారిని గట్టిగా కసిరి ఆ నెక్లెస్ మెడలో వేసుకుంది . ఆ సెంటు రాసుకుంది .
.
" చాలా బావుంది " అని అంది .
.
ఆమె వెనుకగా నించున్న టెడ్డీ "నిజంగా ఈ రోజు మీరు  మా అమ్మలా వాసన వేస్తున్నారు " అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా క్లాసును వదల లేకపోయింది థామ్సన్ . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది . 

ఆ రోజు నుండి ఆమె వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . టెడ్డీ లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు . 
.
.
ఇక్కడితో అయిపోలేదు . 
.
.
నెక్స్ట్ సంవత్సరం ఆమెకు టెడ్డి నుండి వచ్చిన ఉత్తరం లో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " .అది ఆ ఉత్తరం సారాంశం . 
.
6 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకో ఉత్తరం " నేను సెకండరీ విద్య క్లాస్ లో థర్డ్ గా కంప్లీట్ చేశాను . అయినా మీరే నా ఫేవరెట్ టీచర్ " 
.
నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి సంతకం లో Theodore F. Stoddard, M.D. అని సంతకం చేశాడు . 
.
.
ఇంతటితో ఈ కధ అయిపోలేదు . 
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
" నేను ఒక అమ్మాయిని చూశాను చర్చిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . చర్చిలో పెళ్ళికొడుకు తల్లి కూర్చునే బెంచి మీద మీరు కూర్చోవాలని నా కోరిక " 
.
.
.
.
థామ్సన్ పెళ్ళికి వెళ్ళేటపుడు టెడ్డీ ఇచ్చిన నెక్లెస్ పెట్టుకుంది . అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . సెంట్ రాసుకుంది . 
.
.
.
.
ఆ రోజు కూడా టెడ్డీ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది . 
.
.
.
.
.
( మనం మన ప్రభావం ఎవరి మీద అయినా ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా! ఎదుటి వ్యక్తి తో ప్రేమగా ఉందాము . ప్రేమను పంచే ప్రయత్నం చేద్దాము !)

             సౌమనస్య మస్తు !
                     స్వస్తి

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణోవసతు మమ హృద్ధామ్ని సతతమ్ ॥

       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ