ఒక తండ్రి అందరితో పరుషంగా కోపంగా మాట్లాడుతుండే తనకొడుకుతో "జీవితంలో ఎప్పుడూ ఎవరినీ హర్ట్ చేయద్దురా! "అని చెబుతుండేవాడు.అయినా కొడుకు తండ్రి మాట వినిపించుకునేవాడు కాదు.
అతనికి ఒకసంచిలో కొన్నిమేకులు ఇచ్చి నీకు కోపంవచ్చిన ప్రతిసారి ఒకమేకును గోడలోకి కొట్టమన్నాడు.
మరుసటి రోజు కొడుకు, తండ్రి చెప్పిన సలహాప్రకారం చేసి రాత్రికి గోడకు కొట్టిన మేకులను కౌంట్ చేయగా, 34వున్నాయి. మరుసటిరోజు 30, అలాగ ఒక వారం తరువాత మేకులన్నీ అయిపోయాయి.
తండ్రి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్నిచెప్పాడు.
తండ్రి, కోపం వచ్చి పూర్తిగా తగ్గిన ప్రతిసారి ఒక మేకును గోడనుంచి తీసేయమన్నాడు. పది రోజుల తరువాత గోడకుకొట్టిన మేకులన్నీ తీసివేయడం జరిగింది.
ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు.
అప్పడు తండ్రి కొడుకుతో,ఇప్పుడు గోడ దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి రమ్మన్నాడు.
కొడుకు తిరిగివచ్చి తండ్రితో,గోడకు రంద్రాలున్నాయన్నాడు.
చూశావా, నీకోపం వలన గోడకు/కొట్టిన మేకులను తీసివేయగలిగావు గానీ రంద్రాలను చేశావు.
అలాగే ఎవరినైనా హర్ట్ చేస్తే అతని మనసుకు ఇలాగే రంద్రము పడుతుంది. ఒకవేళ నీవు సారీ చెప్పిఅతని మనసుకు కొట్టిన మేకులను తీసివేయగలవేమోకాని, రంద్రాలను కాదు గదా! ఒకవేళ ఆ రంద్రాలను కూడా మూసివేసి ఎప్పటిమాదిరిగా చేయాలంటే అదనంగా "ప్రేమ" అనే సిమెంట్ , గౌరవం అనే రంగును అద్దవలసి ఉంటుంది.
*So dont hurt any body*
సోర్స్ :- వాట్సాప్
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
No comments:
Post a Comment