Monday 2 October 2017

ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల ..???


       


ఒక పిల్లికి ఎలుకల మంద ఒకటి కనపడింది. 
పిల్లికి అమితానందం అయిపోయింది. 
ఒక్కదాన్నైనా పట్టి విందు చేసుకోవాలని వాటి వెంట పడింది.
పిల్లీ, అండ్ ఎలుకలు - టామ్ అండ్ జర్రీల్లా - పరుగెత్తాయి. 

అందులో వయోభారంతో ఒక ఎలుక వెనుకబడింది.. ప్రాణభయం ఎక్కువయింది. తెగించింది. వెనక్కి తిరిగి పిల్లిని చూసి కుక్కలా భౌ భౌ అని మొరిగింది.  

నోటిదాకా వచ్చేసిన కూడు పట్టుకోబోతున్న పిల్లి ఖంగు తింది.. ఆగింది .. తటపటాయించింది.. వెనక్కి తిరిగి పరుగో పరుగు.. 
ఊహించని ఈ పరిణామానికి వృద్ధ మూషికానికి మతి పోయింది. 

పారిపోయిన మిగతా మూషికాలు వెనక్కి వచ్చి ఈ ముసలి ఎలుకను అభినందించాయి.. 

అప్పుడు ఆ వృద్ధ మూషికం …...........................


”ఇతర భాషలు నేర్చుకోవడం వలన ఆపదలనుండి గట్టెక్కొచ్చు.. తెలుసా”... ............అని పెద్ద కన్నంలోంచి కలుగులోకి పోయింది.

No comments:

Post a Comment