రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
శ్రావణపౌర్ణమి రోజునే రాఖీపౌర్ణిమ ఎందుకు ?
-----------------------------------------------------
-----------------------------------------------------
రాఖీపౌర్ణిమ , జంధ్యాలపౌర్ణిమ గా పిలువబడే శ్రావణ పౌర్ణిమ సోదర సోదరీమణుల ఆత్మీయతకూ, అనురాగానికీ , ప్రేమకు ప్రతిరూపం.
భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో మధురమైన గుర్తు ఈ పండగ.
వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఈ రాఖీ బంధం సృష్టిస్తుంది.
సోదర ప్రేమకు చిహ్నంగా ఈ రక్షాబంధనం ప్రాచుర్యం పొందింది.
అసలు సంవత్సరంలో ఇన్ని రోజులుండగా ఈ శ్రావణపౌర్ణిమ రోజునే రాఖీపండుగను ఎందుకు జరుపుకుంటున్నామో చూద్దాము.
జ్యోతిష దృక్కోణంలో చూసినపుడు అమావాస్య జ్ఞాన సిద్ధికి ప్రతీక అయితే పౌర్ణిమ కార్యసిద్ధికి ప్రతీక.
( ఎందుకంటే ఆత్మకారకుడు ఐన రవితో మనో కారకుడు అయిన చంద్రుడు ఒకే డిగ్రీ పై కలయిక జరిగినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. రవికి సరిగ్గా ఎదురుగా 180 డిగ్రీల దూరములో ఉన్నప్పుడు పౌర్ణిమ ఏర్పడుతుంది.
నిజానికి " మన్" అన్న సంస్కృత ధాతువు నుండి మనస్సు, మనిషి అనే శబ్దాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనోకారకుడు ఐన చంద్రుడు మనిషికి ప్రతీక. రవి పరమాత్మకు ప్రతీక.
పరమాత్మతో సంయోగం సూచించే అమావాస్య జ్ఞానసిద్ధి కారకమయితే , ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ ప్రకాశాన్నీ , తేజస్సు ను పొందే పౌర్ణిమ కార్యసిద్ధికీ - సంపూర్ణ అభివృద్ధికి ప్రతీక.)
నిజానికి " మన్" అన్న సంస్కృత ధాతువు నుండి మనస్సు, మనిషి అనే శబ్దాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనోకారకుడు ఐన చంద్రుడు మనిషికి ప్రతీక. రవి పరమాత్మకు ప్రతీక.
పరమాత్మతో సంయోగం సూచించే అమావాస్య జ్ఞానసిద్ధి కారకమయితే , ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ ప్రకాశాన్నీ , తేజస్సు ను పొందే పౌర్ణిమ కార్యసిద్ధికీ - సంపూర్ణ అభివృద్ధికి ప్రతీక.)
ఇక పౌర్ణిమ రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమి ఉండే మాసానికి పేరు ఉంటుంది.
ఉదాహరణకు..
పౌర్ణమి రోజు చిత్త నక్షత్రం ఉండే మాసం చైత్రమాసం.
పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉండే మాసం వైశాఖ మాసం.
పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉండే మాసం జ్యేష్ఠ మాసం.
పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉండే మాసం ఆషాఢ మాసం.
పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉండే మాసం వైశాఖ మాసం.
పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉండే మాసం జ్యేష్ఠ మాసం.
పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉండే మాసం ఆషాఢ మాసం.
అలాగే పౌర్ణమి రోజు శ్రవణం నక్షత్రం ఉండే మాసం శ్రావణ మాసం.
...ఇలాగే అన్ని మాసాలున్నూ.
...ఇలాగే అన్ని మాసాలున్నూ.
"శ్రవణం కార్యసాధకం " అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఒక్కోక్క నక్షత్రం యొక్క ప్రత్యేకతను చెబుతూ అశ్విని వైద్యానికి , భరణి అపమృత్యు దోష నివారణకూ,.....ఇలా శ్రవణం కార్యసాధన ఫలితాన్ని ఇస్తుందనీ , అలా ఉపయోగించుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఇకపోతే శ్రవణానికి అధిదేవత "విష్ణువు".
సృష్టి కారకుడు బ్రహ్మ , లయ కారకుడు శివుడు అయితే స్థితి కారకుడై రక్షించేది విష్ణువు.
కాబట్టే అలాంటి జగత్ రక్షకుడయిన విష్ణువు అధిదేవత గా గల కార్యసిద్ధిని కలిగించే శ్రవణా నక్షత్రం ఉండే "శ్రావణపౌర్ణిమ" రోజున మనం రాఖీపౌర్ణిమ జరుపుకుంటాము.
ఇక ఈ రక్షాబంధనం ఎలా చేయాలో అందరికీ తెలిసినా ఇప్పటితరం వాళ్లకు తెలియడానికి మరోసారి తెలియజేస్తున్నాను.
శ్రావణ పౌర్ణమి నాడు సోదరీమణులు ఓ పళ్లెంలో రాఖీలు,పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వంటి ద్రవ్యాలను ఉంచి , ముందుగా కులదైవాన్ని ప్రార్థించి, ఏదైనా తీపి ప్రసాదాన్ని నివేదించాలి. తర్వాత దేవునిముందు రాఖీలను పూజించి ,అనంతరం ఈ ప్రసాదాన్ని మరియు రాఖీలను ఉంచిన పళ్లెమును తీసుకుని వచ్చి, అన్నదమ్ములకు తిలకం దిద్ది, తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి.
ఈ రోజున కట్టే రాఖీలకు విష్ణుశక్తిని ఆవాహన చేసే ఈ క్రింది మంత్రాలను చదువుతూ సోదరీమణులు తమతమ సోదరుల కుడి చేతి మణికట్టుకు రక్షను ( రాఖీని) కట్టాలి.
1) యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
తా౹౹ మహాబలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా? నీవు స్థిరత్వంలో ఉండగలవు-అని దీని అర్థం.
2) వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ। శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవోభిరక్షితు।।
తా ౹౹ వనమాలినీ, గదనూ, శంఖమునూ,చక్రమునూ, నందకములను ధరించిన హే ! నారాయణా! విష్ణూ ! వాసుదేవా! మా సోదర కుటుంబాన్ని, మా కుటుంబాన్ని అన్ని వైపుల నుండి - అన్ని విధాలుగా నిరంతరం రక్షించుచుండుము అని భావం.
ఇలా రాఖీ కట్టాక భగవంతునికి నివేదించిన తీపి ప్రసాదాన్ని సోదరులకు తిపించాలి. ఆ తర్వాత సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.
అక్కా చెలెళ్ళు అడిగిన బహుమతిని లేదా తమతమ శక్తికొలది సాంప్రదాయ బద్ధంగా బహుమతిని సోదరులు అందించి ఆనందాన్ని పొందుతారు.
ఈ శ్రావణపూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుందని సనాతన ధర్మాన్ని పాటించే ప్రజల విశ్వాసం. జన్మతః సోదరులు కాని వారందరినీ కూడా ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ఈ ‘రక్షాబంధనం 'లో ఇమిడి ఉంది.
తన సోదరుని లేదా సోదర సమానుని క్షేమం కాంక్షించే ప్రతి సోదరి పవిత్ర రక్షను అతని మణికట్టుకు ముడి వేస్తుంది. ఈ రక్ష ఏ ఆపద సమయంలోనైనా తన సోదరుడిని రక్షించాలని ఆమె ఆకాంక్ష. సోదరి ప్రేమకు సంకేతంగా ఉండే ఈ సూత్రం సోదరుడికి తన అక్కా లేదా చెల్లెలి విషయంలో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సోదరి సుఖసౌభాగ్యాల కోసం అతను ఎలాంటి త్యాగాలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహం కల్గిస్తుంది.
నిర్భయ వంటి సంఘటనలు జరుగుతున్న ఈ కాలం లో ప్రజల మధ్య సోదర సోదరీ సంబంధాలు పెరుగవలసిన ఆవశ్యకతను ఈ శ్రావణపౌర్ణిమ నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది.
ఇంతటి శుభసమయవేళ ఈ వ్యాసాన్ని నా సోదరికి అంకితమిస్తూ మీ అందరికి రాఖీపౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
స్వస్తి
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
No comments:
Post a Comment