రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
సూర్యడు
---------------------------------------
---------------------------------------
జ్యోతిషశాస్త్ర దృష్ట్యా ఆత్మ శక్తికి సూర్యుడు కారకత్వాన్ని వహిస్తాడు.
ఆత్మశక్తి ఉద్దీపనం చెందిన వ్యక్తి మిగతా శక్తులను సులభంగా పొందుతాడు.
తండ్రిని గౌరవించని వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని వ్యక్తి, సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం గల వ్యక్తుల జాతకాలను పరిశీలించినపుడు వారికి సూర్యుడు వ్యతిరేక స్థానాలలో ఉండడాన్ని మనం గమనిస్తాము.
సూర్యుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులకు ఈ లోకంలో సాధించలేనిది అంటూ ఉండదు.
ఎందుకంటే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మ ప్రకాశవంతమౌతూ ఎప్పుడూ కాన్సియస్ తో ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ని దోషాలనుండి విముక్తమౌతూ అన్ని విషయాల్లోనూ సరియైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.
అలాగే ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
సూర్యుని అనుగ్రహం లేని వ్యక్తి తాను అసంతృప్తిని అనుభవిస్తూ ఇతరులను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల చివరకు తాను తృప్తిగా ఉండలేడు - అలాగే ఇతరులనూ సంతృప్తి పరచని స్థితి ఏర్పడుతుంది.
ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి అనే విషయం సూర్యున్ని చూసి నేర్చుకోవచ్చు!
సూర్యుడు ఇతరుల కోసం ప్రాత:కాలంలో ఉదయించడం లేదు. ఇతరుల కోసం అస్తమించడం లేదు. అది తన ధర్మం కాబట్టి ఈ పనులన్ని చేస్తున్నాడు. అప్పుడు లోకమంతా అతని ప్రవర్తనను అర్థం చేసుకుని తమ జీవితాలను అందుకు అనుగుణంగా మార్చుకుని సూర్యున్ని అనుసరిస్తుంది.

ఒక నాయకుడు కూడా సూర్యుని లాగే వ్యవహరించాలి.
తాను హృదయపూర్వకంగా నమ్మిన సిద్ధాంతాన్ని నియమబద్ధంగా ధృడమైనదీక్షతో ఆచరిస్తూ వెళుతున్నా కొద్దీ లోకం కూడా క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అనుసరిస్తుంది.
విజయం పొందిన ఏ నాయకుల చరిత్రను చూసినా ఈ విషయం సత్యమైనదని అర్థమౌతుంది.

సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.
రథస్యైకచక్రం భుజగనమితా సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
అంటే ....
(పురాణాలు వర్ణించిన ప్రకారం )సూర్య భగవానుడు ప్రయాణించే రథానికి ఒకే చక్రం ఉంటుదట. ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి.ఇక ఆ గుర్రాలను పట్టి ఉంచే పగ్గాలేమో పాములు. ప్రయాణించే మార్గం...ఆధారం లేని ఆకాశ మార్గం. ఆ రథాన్ని నడిపే రథ సారథి తొడల నుండి క్రింది భాగం లేని అంగ వైకల్యం కల అనూరుడు.
ఇన్ని కష్టాలతో కూడిన ప్రయాణం చేస్తుా కూడా ఆకాశంలో సూర్యుడు గతి - నియమం - ధర్మం తప్పడం లేదు. మహాత్ములకు ఏ ఉపకరణాలు లేకున్నా సమస్త కార్యాలు సిద్ధిస్తాయని పై శ్లోకం యొక్క అర్థం.
ఇలాంటిదే సూర్యవంశ సంజాతుడైన రాముని గూర్చిన మరో శ్లోకం ఉంది.
విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః |
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః |
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||
భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణాలు , అంటే
విమానాలు , నౌకలు వంటివి లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా , శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు, బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు, ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు సరిగ్గా లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. ఇక తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు.

ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,విజయం సాధించి
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు లభించిన ఉపకరణాలనూ - అనుచరులనూ - పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని - విజయాన్ని సాధించగలరు.
ఆదే విధంగా నిజమైన నాయకులు ఎలాంటి అనుచరులూ - ఉపకరణాలు ఉన్నా , ఎన్ని కష్టాలు ఎదురైనా వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు.
ఇదిగో ఇలాంటి ధృతిని - నాయకత్వ లక్షణాలను ప్రసాదించేది సూర్యుడు.
ఇంకా
సమయ పాలన - ఇతరులను గౌరవించడం - దానగుణం - మాటకు కట్టుబడి ఉండడం -పితృభక్తి - ఆరోగ్యం పట్ల శ్రద్ధ - నాయకత్వ లక్షణాలు - అంత:శుద్ధి - హుందా స్వభావం - ఆత్మ విశ్వాసం - నిజాయితీ - రాముని లా ధర్మం,సత్యం విషయంలో కఠిన ప్రవర్తన... మిగతా విషయాలలో సున్ని తత్వం - ఆర్థిక పరమైన స్పృహ లేదా అభిమానం - ఇతరుల వద్ద చెయ్యి చాపక పోవడం ..... మొ|| మంచి లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటే లభిస్తాయి.
ఈ క్రింది ఆదిత్య హృదయం ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని పారాయణం చేయడం వల్ల ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.ఈ ఆదిత్య హృదయం రావణునిపై విజయం సాధించడం కోసం అగస్త్య మహర్షి స్వయంగా రామునికి ఉపదేశించాడు. ఇది చాలా మహత్యం కలిగింది.దీనిని ప్రతిరోజూ చదివితే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ క్రింది "సూర్య కవచం " ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైన కవచం. దీనిని శ్రద్ధగా పారాయణం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభించడమే కాక, పితృ దోషాలు జాతకంలో ఉన్న వారికి ఆ దోష ప్రభావం తగ్గి అన్ని విషయాలలో చక్కని అభివృద్ధి ఏర్పడగలదు.
ఇంకా ఇతర స్తోత్రాలు ఆదివారం చదవ వలసినవి.ఈ క్రింది ఫైల్స్ పై నొక్కండి.
స్వస్తి
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
No comments:
Post a Comment